Header Banner

యూజర్లకు షాక్‌ ఇచ్చిన BSNL! ఆ మూడు ప్లాన్ లు రద్దు! ఆ లోపు రీఛార్జి చేయించుకోండి!

  Sun Feb 02, 2025 12:41        Technology

గ‌త ఆరు నెల‌లుగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కు కస్టమర్లు విపరీతంగా పెరిగిన‌ సంగతి తెలిసిందే. యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించే కొత్త ప్లాన్లతో పాటు.. నెట్వ‌ర్క్‌ క్వాలిటీ కూడా పెంచ‌డంతో మ‌రింత మంది యూజ‌ర్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఇత‌ర బ‌డా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ రేట్లు పెంచిన త‌ర్వాత.. బీఎస్ఎన్ఎల్ వైపు సామాన్యులు మొగ్గుచూపుతున్నారు. 

 

ఐతే, తాజాగా BSNL తన కోట్లాది మంది వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తమ ప్రీపెయిడ్ పోర్టు ఫోలియో నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మూడు ప్లాన్లను తొలగించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ తర్వాత యూజర్లకు ఆ ప్లాన్లు అందుబాటులో ఉండవు. ఈ లోపు రీఛార్జ్ చేసుకున్నవారు ఆ ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ ప్ర‌క‌టించింది. మ‌రి అవేంటో ఒక‌సారి చూద్దాం. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

201 ప్లాన్.. BSNL నిలిపివేయాల‌నున్న ప్లాన్ల‌లో రూ.201 రీఛార్జ్ ప్లాన్ ఒక‌టి. ఈ ప్లాన్‌తో 90 రోజుల వాలిడిటీతో 300 నిమిషాల కాలింగ్, 6 GB డేటా పొందుతారు. ఇవి కాకుండా ఈ ప్లాన్‌లో ఇతర ప్రయోజనాలు ఏవీ లేవు. కాకపోతే, సిమ్‌ను ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచడానికి ఇది ఉత్తమ ప్లాన్. 797 ప్లాన్.. రూ.797 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 60 రోజుల వాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం ల‌భిస్తుంది. ప్ర‌తిరోజు 2 GB డేటాతో పాటు 100 SMS ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో సిమ్ 300 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. 

 

2999 ప్లాన్.. BSNLలో 365 రోజుల‌ పాటు వాలిడిటీతో ఉండే ప్లాన్ రూ.2999. ఇందులో యూజర్లు ప్రతిరోజూ 3 GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSల ప్రయోజనం పొందుతారు. పూర్తి ఏడాదికి మొత్తం ఒకేసారి రీఛార్జ్ చేసుకోవాలనేవారికి ఇది ఎంతగానో మేలు చేకూరుతుంది. ఇక, BSNL వినియోగదారులు ఫిబ్రవరి 10 లోపు రీఛార్జ్ చేసుకుంటే.. ప్లాన్ కాలపరిమితి వరకూ ఈ ప్లాన్ల ప్రయోజనాలను పొందవచ్చు. ఆ త‌ర్వాత ఈ మూడు ప్లాన్లు యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉండ‌వు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Technology #Telecom #TelecomServices #BSNL #MTNL #India #Gadgets #CentralGovernment